— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన, గుండ్లపల్లి: గుండ్లపల్లి డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల లో డ్రైనేజీ సమ స్యను, సోలార్ లైట్ల సమస్యను పరిష్కరిం చేందుకు తక్షణమే ప్రతి పాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. గురువారం రాత్రి ఆమె నల్గొండ జిల్లా, గుండ్లపల్లి డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠ శాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కళాశాల పరిస రాలను, వంట గదిని ,స్టోర్ రూమ్ , తరగతి గదుల ను ఆమె తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా విద్యార్థు లకు అందిస్తున్న భోజనానికి సం బంధించిన వంట సరుకులను తని ఖీ చేశారు. అనం తరం ఇంటర్మీడి యట్ ,5 ,6 తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థి నిలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్య పరిజ్ఞానాన్ని ప్రశ్నలు, జవా బుల ద్వారా పరీ క్షించారు.
విద్యా ర్థినిలు బాగా చదువుకోవాలని, సమయాన్ని వృధా చేయవద్దని, విద్యద్వారానే సమా జంలో మంచి స్థానాన్ని పొందవచ్చని సూచించా రు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మంచి జవాబులు ఇచ్చిన విద్యా ర్థులకు చాక్లెట్ల ను పంపిణీ చేశా రు.కళాశాల ప్రిన్సి పల్ శిరీష, ఉపా ధ్యాయులు ఉన్నారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ గుండ్లపల్లి డిండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు . జిల్లా కలెక్టర్ ఆక స్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరో గ్య కేంద్రానికి తాళం వేసి ఉండడం, 20 నిమిషాల తర్వాత వాచ్ మెన్ వైద్య ఆరోగ్య కేంద్రానికి రాగా పి హెచ్ సి లో ఎవరూ లేక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాచ్ మెన్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీ సర్, ఇతర సిబ్బందికి మెమొలు జారీ చేయాలని చెప్పారు.