ప్రజా దీవెన ,కోదాడ: పట్టణంలోని సీసీ రెడ్డి పాఠశాలలో 19,20 తేదీలలో జరిగే సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్) ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలో ని సిసి రెడ్డి పాఠశాల ఆడిటోరియంలో ఎంఈఓ లు, జిహెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు 23 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించి సైన్స్ ఫెయిర్ విజయవంతవానికి కృషి చేయాలి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి లాం.దేవరాజ్,
కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్,సూర్యాపేట మండల విద్యాధికారి ఎస్ శ్రీనివాసరావు,వివిధ కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.