District SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ క్రైమ్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా ఎస్ ఎం ఎస్ వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుదని వారి పట్ల జాగ్రత్త గా ఉండలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి సి వి వి, ఓటీపీ మరియు .
ఇతర వివరాల వంటి తెలుసుకొని క్రెడిట్ కార్డ్ హోల్డర్ యొక్క సున్నితమైన డేటాను పొంది మీ క్రెడిట్ కార్డు లో ఉన్న లిమిట్ ను ఖాళీ చేస్తారని అన్నారు.అటువంటి కాల్స్ వస్తే నమ్మకండి, ముఖ్యంగా మీ కార్డు , సి వి వి నంబరు ఓటీపీ వంటి వివరాలను ఎవ్వరికీ చెప్పవద్దని తెలిపారు. ఏలాంటి సంఘటనలు జరిగిన వెంటనే
సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు లేదా 1930 టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి రిపోర్ట్ చేయగలరు.