District SP Sharath Chandra Pawar : జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ సీరి యస్, నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో సామాజిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపుచేసేందుకు మరింత సమర్ధ వంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి శరత్ చంద్రపవార్ పోలీ సు అధికారులకు సూచించారు. నే రాల అదుపులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పో లీసు అధికారులతో నిర్వహించి న నెల వారి నేర సమీక్షా సమావేశం లో జిల్లాలో నేరాల నియంత్రించడా నికి తీసుకుంటున్న చర్యలు, పెం డింగులో ఉన్న కేసుల వివరాలు, కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పా ల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముం దస్తు చర్యలను ఈ సందర్భంగా ఎస్పీ అదికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజా అవసరాలకు అనుగుణం గా పోలీసు శాఖ పారదర్శకంగా సే వలందిస్తూ ప్రజా మన్ననలు పొందే లా ముందుకు సాగాలని సూచిం చారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వా టి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్ర తల పరిరక్షణలో రాజీ లేకుండా ప ని చేయాలన్నారు. ముఖ్యంగా ని ఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసిటీవీల వల్ల భద్రతా ప్ర మాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మ రింత ప్రోత్సహించే విధంగా అధికా రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
నేరం చేసే వాడికి శిక్ష పడాలని, నే రంచేయని వారికి రక్షణగా ఉంటూ సమర్ధ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పంతో పోలీస్ శాఖ లక్ష్యంగా పనిచేయాలన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారిరక్షణ ప్రధానధ్యేయం గా నాణ్యమైన, సత్వర సేవలు అం దించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేష న్ లో పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, SC/ST కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసి కోర్ట్ లో ఛార్జ్ సీట్ దాఖ లు చేయాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అ వసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శా ఖలు, ప్రజలను సమన్వయం చే స్తూ వాటిని అధిగమించేలా ముం దుకు సాగాలన్నారు.జిల్లాలో దొంగ తనాలు నివారణకు రాత్రి,పగలు పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, పాత నేరస్థుల పై నిఘా ఏర్పాటు చేయాలని తెలి పారు. సైబర్ నేరాల ఆన్ లైన్ బెట్టిం గ్, లోన్ యాప్ ల పట్ల ప్రజలకు అ వగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు అక్రమ గంజాయి,జూదం,పీడీఎస్ బియ్యం,అక్రమ ఇసుక రవాణా వం టి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల ని అన్నారు. అనంతరం తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ లు నర్సింగరావు, శివ నాయుడుచే ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కేసులలో చ ట్ట ప్రకారం నిందితులను సెర్చ్ చేసే విధానం, స్వాధీన పరుచుకున్న గం జాయిని సీజ్ చేయు సమయంలో సంబంధిత అధికారులు,పంచుల సమక్షంలో చేయవలసిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దర్యా ప్తు అనంతరం చట్ట ప్రకారం నింది తులకు కోర్టులో శిక్ష ఎలా పడాలనే తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్ ,అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పి, శివ రాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, డిసిఆర్బి, డిఎస్పీ రవి, సీఐ లు, యస్.ఐ లు,సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.