*నూతన క్యాలెండర్ ఆవిష్కరణ*
Medicalofficer : ప్రజా దీవెన, కోదాడ: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందించే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో తెలంగాణ పల్లె దావఖాన డాక్టర్స్ అసోసియేషన్ 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్య నిమిత్తం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలోని 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల బీపీ ,షుగర్ ,పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖవంతమైన ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాజియా, డాక్టర్లు శ్రీశైలం, నాగరాజు పల్లెదావఖాన అసోసియేషన్ సభ్యులు డాక్టర్ లు వీరేంద్రనాథ్, విజయ్, అనూష అమృత, అఖిల్, బిందు, రవీందర్ మౌనిక,మమత తదితరులు పాల్గొన్నారు.