Doddi Komaraiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah) అని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ (srinivas) న్నారు. దొడ్డి కొమ రయ్య వర్ధంతి సందర్భంగా గురు వారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యా లయంలోని సమావేశం మందిరం లో దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah)చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళు లర్పిం చారు. ఈ సందర్భంగా అద నపు కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటం కాలక్ర మేనా తెలంగాణ సాయుధ పోరా టానికి దారితీసిందని, ఈ పోరా టంలో ప్రాణాలను కోల్పో యిన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయు ధ పోరాటానికి ఆద్యుడిగా నిల్చా డని అన్నారు. అలాంటి మహాను భావుల త్యాగాల ఫలితమే తెలం గాణ అని అన్నా రు.జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, హౌ సింగ్ పీడీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇంచార్జి (In charge of BC Welfare Department)అధికారి రాజ్ కుమార్, కలెక్ట రేట్ ఏ ఓ మోతి లాల్, ఇతర అధికారులు, తదిత రులు ఈ కార్యక్ర మంలో పాల్గొని దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.