Dog’s Tumor : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలోని స్థానిక శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కుమ్మజడ బాబు పెంపుడు శునకం కొద్దిరోజులుగా వీర భాగములో కణితి గడ్డ తయారై పగిలి నెత్తురోడుతున్న సందర్భంగా. వైద్యంతో రికవరీకి అవకాశం లేకపోవడం తో కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో గురువారం అసిస్టెంట్ డైరెక్టర్ డా పెంటయ్య పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించి రెండు గంటలపాటు శ్రమించి కుక్క వీర భాగంలోని పగిలిన కణితిని తొలగించి విజయవంతంగా
ఆపరేషన్ ముగించారు అత్యవసర పరిస్థితిలో తమ పెంపుడు శునకానికి ఆపరేషన్ విజయవంతం కావడం పై యజమాని హర్షం వ్యక్తం చేశారు
శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు చంద్రకళ. రిక్షిత్ తదితరులు పాల్గొన్నారు