Dr. Kathi Venkateswarlu : ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా సోమవారం పట్టణంలో కృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ ఎం జె ఎఫ్ ఎం వి ఎఫ్ ఎం ఎస్ పి విహెచ్పిఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం వి ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పాఠశాల రఘు మాదిగ విహెచ్పిఎస్ జాతీయ నాయకులు కర్ల విజయరావు ఎంఎల్ఎఫ్ నియోజకవర్గ నాయకులు ముందు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ 30 సంవత్సరాల గా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేశారని నాయకులు గుర్తు చేశారు.
ప్రజల మధ్యలో ఉండి అనేక పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించటం మాదిగ జాతి మొత్తం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు తమ మద్దతు సంఘీభావాన్ని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కంభంపాటి శ్రీనివాస్, గంధం పాండు, చీమ శ్రీనివాస్ రావు, లు పాల్గొనిమాట్లాడినారు కార్యక్రమంలో ఆంజనేయులు కోటేష్ సత్యరాజు స్నేహలత చౌదరి ఆనంద్ శ్రీనివాసరావు బాబు అంజయ్య శ్రీకాంత్ బొడ్డు కుటుంబరావు మునగాల నడిగూడెం చిలుకూరు అనంతగిరి కోదాడ మండలాల ఎమ్మార్పీఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు