Dr. Upender Samudrala : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల డైరీని సోమవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. సంగి రమేష్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ అధ్యాపకులంతా అంతర్గత కలహాలు మాని విద్యాభివృద్ధికి తోడ్పాడాలని పిలుపునిచ్చారు. అధ్యాపకులు ఎదురుకుంటున్న అనేక సమస్యలను సామరస్యంగా ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు.
ప్రభుత్వ కళాశాలలకు విద్య కోసం వచ్చేది ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల పిల్లలేనని అన్నారు. మొదటి తరం విద్యార్థులను విద్యావంతులను చేస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతాయని అన్నారు. అధ్యాపకుల సంఘాలు రెండూ సామరస్యంతో అంశాలవారీగా కలిసి పని చేయాలని కోరారు. మనలో మనం తగవులాడితే విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు.
కార్యక్రమంలో జిసి టి ఏ రాష్ట్ర అధ్యక్షులు డా. శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి డా. బ్రిజేష్, టిజిసిజిటిఏ రాష్ట్ర అధ్యక్షులు డా. భాస్కర్, రాష్ట్ర నాయకులు డా. శంకర్, డా. వాసం శ్రీనివాస్, నల్గొండ జిల్లా అధ్యాపక సంఘ నాయకులు డా. ఎం. అనిల్ అబ్రహం, డా. బొజ్జ అనిల్ కుమార్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.