Driver Died: ప్రజా దీవెన, నిడమనూరు : ట్రాక్టర్ (tractor) పల్టీ కొట్టిన ప్రమా దంలో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన తుమ్మడం గ్రామం లో శనివారం జరిగింది. గ్రామా నికి చెందిన గోలి శోభన్ బాబు (38) అదే గ్రామానికి చెందిన రైతు సిద్ధ పంగు సైదులు కు చెందిన ఎకరం వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ పుల్వీ ల్స్ (Tractor Pulleys) తో శనివారం మధ్యాహ్నం సుమా రు 12 గంటల సమయంలో దమ్ము చేస్తుండగా బురద మడిలో ట్రాక్టర్ దిగబడిపో యింది. ట్రాక్టర్ ఎంతకూ కదలక పోవడంతో బురద మడి నుంచి వెలికి తీసేందుకు ఫుల్ వీల్స్ కింద కర్రలు పెట్టి ట్రాక్టర్ ను (tractor) శోభన్ బాబు వేగంగా ముందుకు నడపడంతో ప్రమా దవశాత్తు ట్రాక్టర్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి బుర దలో కూరు కుపోయిన శోభన్బాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమీప రైతులు పరుగె త్తుకొచ్చి శోభన్బాబు ను వెలికి తీసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. హుటాహుటిన జేసీబీని (jcb) రప్పించి ట్రాక్టర్ ను జేసీబీ సాయంతో బయ టకు లాగి బుర దలో కూరుకుపో యిన శోభన్ బాబు ను బయటకు తీసుకొ చ్చారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా మారిన శోభన్ బాబు ను చూసి హతాశు లయ్యారు. శోభన్బాబుకు భార్య రాధ, ఇద్దరు కుమా రులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని శవ పంచనామా నిర్వహిం చారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖాన కు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు (case) చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ, జె.గోపాల్ రావు తెలిపారు.