*రెండు సెల్ ఫోన్లను స్వాధీనం
*నిద్ర మత్తు మాత్రల విలువ 3,700
DSP Sridhar Reddy : ప్రజా దీవెన, కోదాడ: నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ సోమవారం నమ్మదగ్గ సమాచారం మేరకు అక్రమంగా నిద్రమత్తు మాత్రలను అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్న సంఘటన సోమవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా కోదాడ పట్టణములోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ నడిగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి బిక్షమయ్య తన సాయి మెడికల్ మరియు జనరల్ షాప్ నందు నిద్రమత్తు టాబ్లెట్లను అక్రమంగా నిలవచేసి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా .
ఖమ్మం పట్టణానికి చెందిన ఎండి షాదబ్ ఖాన్ అమ్ముతుండగా సోమవారం మధ్యాహ్నం 12,10 గంటలకు నమ్మదగ్గ సమాచారం మేరకు వారిని పట్టుకున్నారు వారి వద్ద నుండి నిద్రమత్తు మాత్రలు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిద్ర మత్తు టాబ్లెట్లు మొత్తం 42 సీట్లు వాటి యొక్క విలువ సుమారు 3,700 రూపాయలు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఈ కేసు పర్యవేక్షణ చేసిన మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ సిబ్బందిని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి అభినందించారు ఈ కేసును శాఖ చక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది కు సూర్యాపేట ఎస్పీ నరసింహ రివార్డులు ప్రకటించినట్లు డి.ఎస్.పి తెలిపారు