Drugs: ప్రజా దీవెన, చండూరు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే ద్యేయంగా ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్య సించేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, అందు లో భాగంగానే శనివారం గంజాయి, డ్రగ్స్, తదితర మత్తు పదార్థాల నియంత్రి “ణపై కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు(stuednts) అవగాహన (Awareness)కల్పించినట్లు స్టూడెంట్ కెరీర్ అడ్వైజర్ వివేక్ (Advisor Vivek) ముత్తోజు తెలి పారు. విద్యార్థులకు చెడు అలవా ట్లపట్ల, మాదక ద్రవ్యాలు వాడటం వల్ల వచ్చే నష్టాలపట్ల అవగాహన కల్పించారు.
పదవ తరగతి విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధించేం దుకు వారికి తగిన సూచనలు, సలహాలు మోటివేషన్ స్పీచ్ ద్వారా ్వరా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ సభ్యులు (Members of the Foundation) పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లా డుతూ ప్రతి పేదవాడు చదువుకు చేరువ కాకపోతే చదువే వారి చెంతకు వెళ్లాలని స్వామి వివేకా నంద బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ఫౌండేషన్ (Foundation) ద్వారా అనేక సేవా కార్య క్రమాలను (Service procedures) చేస్తుందని, అందు లో భాగంగానే ఈ రోజు మత్తు పతా ర్థాల నియంత్రణపై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవగా హన సదస్సు పుల్లెంల గ్రామంలో నిర్వహించడం జరిగిందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవ ద్దన్నారు.
జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ప్రధానోపాద్యాయులు సరస్వతి మాట్లాడుతూ గతంలో పాఠశాలకు ఎన్నో సేవా కార్యక్రమా లు నిర్వహించడమే కాకుండా తాము అడిగిన వెంటనే స్పందించి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్కు పాఠశాల తరుపున, గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, తల్లిదండ్రులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.