Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DRUGS : 9 కేజీల 345 గ్రాములు గంజాయి పట్టివేత

ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు
ఒక స్కూటీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

DRUGS :  ప్రజా దీవెన, కోదాడ: మోతే మండల పరిధిలో 9 కేజీల 345 గ్రాముల గంజాయిని పోలీసులు ముగ్గురు నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు మంగళవారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరు సమావేశంలో కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి పాల్గొని వివరాలను వెల్లడించారు సోమవారం ఉదయం నమ్మదగ్గ సమాచారం మేరకు మోతే ఎస్ఐ యాద వెందర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలసి మామిళ్ళగూడెం శివారు సింగరేణి టోల్ ప్రజా సమీపంలో తొమ్మిది కేజీల 345 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం వైపు నుండి స్కూటీపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఉన్నారో లేదో అని చూస్తుండగా.

 

పోలీసులు అనుమానంతో ముగ్గురు వ్యక్తులను ఎస్సై తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ముగ్గురు నిందితుల్లో ఎ1 ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన బురం సాయికుమార్ ఏ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన గుండి మురళీకృష్ణ ఎ3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజుపేట కాలనీకి చెందిన భానోత్ ఫణికుమార్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు ఈ తనిఖీలలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ,మోతే ఎస్సై యాద వెందర్ రెడ్డి ,ఐడి డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ ,సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి ,బండి శ్రీనివాస్ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు