— డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్కరికి జైలు శిక్ష :ఎస్ఐ మల్లేష్
Drunk Drivers :ప్రజా దీవేన,కోదాడ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు..ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు.
పట్టుబడిన వారిని బుధవారం కోర్టులో హాజరు పరచగా ఒకరికి ఒక్క రోజు జైలు శిక్ష రూ.2000 జరిమానా, అదేవిధంగా మద్యం సేవించిన ఒక్కరికి రూ.2000/- జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులోహాజరు పరిసినట్లు
ఎస్సై తెలిపారు.