DSP K .Sivaram Reddy : రంజాన్ మాస వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి కె శివరాం రెడ్డి డి. ఎస్. పి నల్గొండ
DSP K .Sivaram Reddy :ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ ఎస్. పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డి. ఎస్. పి కె శివరామ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజాశేఖర్ రెడ్డి నల్గొండ పట్టణ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఇట్టి సమావేశంలో నల్గొండ డి. ఎస్. పి శివరాం రెడ్డి మాట్లాడుతూ ముస్లింలు అందరూ రంజాన్ మాస ఉపవాస దీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఏమైనా సమావేశాలు కానీ, సామూహిక ప్రార్ధనలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా పోలీస్ వారికి తెలియజేయాలని, తద్వారా పోలీస్ వారు బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటారని, ప్రార్ధనల సమయంలో వాహనాలను రోడ్ల పై నిలిపి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూడాలని ముస్లిం సోదరులకి తెలియజేశారు. ఇట్టి సమావేశంలో కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పోలీస్ వారికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పోలీస్ వారి సూచనలను తప్పకుండా పాటిస్తామని తెలియజేశారు.
అనంతరం నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రంజాన్ మాసం ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైనది అని దానిని ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలని తెలుపుతూ, పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని, తద్వారా వాటిని నివారించగలుగుతామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారికి సి. సి కేమరా ల ప్రాముఖ్యత, నేరస్తులని గుర్తించటం లో వాటి యొక్క ప్రాధాన్యత గురించి చెపుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా సి. సి కేమరా లు అమర్చుకోవాలని, కాలనిలోని కూడళ్లలో కచ్చితంగా సి. సి కేమరా అనేది ఉండాలని, వాటి ప్రాధాన్యత కాలనీ ప్రజలకి అర్దమయ్యేలా చెప్పాలని తెలియజేశారు.
ఇట్టి సమావేశంలో నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి, నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజు, ఎస్. ఐ లు శంకర్, సందీప్ రెడ్డి, సైదులు, ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, నల్గొండ పట్టణ కౌన్సిలర్లు, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.