Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Sivaram Reddy : వీడిన మాజీ సర్పంచ్ హత్యకేసు మిస్టరీ..!

–కోపంతోనే హతమార్చిన దుండగులు.

–ఏడుగురు నిందితులను రిమాండ్ పంపిన పోలీసులు.

–వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి.

DSP Sivaram Reddy : ప్రజా దీవెన, నల్లగొండ క్రైం: దాదాపుగా గత 10పదిరోజులుగా నల్లగొండ జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమైన మాజీ సర్పంచ్ హత్య కేసు మిస్టరీకి, ఉత్కంఠకు తెరపడింది. ఈ ఘటనకు పాల్పడిన 11మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు పంపించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శివరాంరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం వెల్లడించారు. శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామానికి చెందిన బండారు మల్లయ్య 2009, 2019లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా బండారు మల్లయ్య గ్రామంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేవాడు. గ్రామంలో ఎస్స్ మాదిగ సమాజిక వర్గం కులదేవత అయినా పాపమ్మకు కొంతభూమిని వారి పూర్వీకులు కేటాయించారు. ఇందులో 12మంది పాలివారికి భాగం ఉన్నది. ఈ గుడికి సంబంధించిన భూమిలో రుద్రరాపు యాదగిరి, రుద్రరాపు మల్లయ్యలు కొంత భూమిని ఆక్రమించి బాత్ రూమ్ లు నిర్మించుకున్నారు.

 

రుద్రారాపు యాదగిరి అలియాస్ చిన్న యాదగిరి, టైలర్ నరసింహ ఒక గుంట భూమిని ఆక్రమించుకున్నారు. ఉపాధ్యాయుడు బండారు యాదయ్య కూడా కొంత భూమిని ఆక్రమించుకున్నారు. ఈ భూమి విషయంలో వారికి గ్రామ కులస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాజీ సర్పంచ్ మల్లయ్య దగ్గర పంచాయితీ పెట్టారు. రుద్రరాపు కుమార్ భూమి ఆక్రమించిన వారికి మద్దతుగా మాట్లాడేవాడు. ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, చుట్టూ పెన్సింగ్ కట్టించాడు. దీనికి కారణం మాజీ సర్పంచ్ మల్లయ్యనే అని కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యను హత్యచేయాలని కుట్రపన్నారు. కిరాయి వ్యక్తులైన సురారపు యాదగిరి, కొంపల్లి చంద్రమౌళి, కొంపల్లి శ్రీరాములు, సూరారం నర్సింహాతో రూ.11లక్షల సుపారి మాట్లాడుకున్నారు.

 

 

ఈ నెల జనవరి మొదటి వారంలో మల్లయ్య హత్యకు విఫలయత్నం కాగా, ఈ నెల 21న పొలం నుంచి వస్తుండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కర్రలతో దాడిచేశారు. అపస్మారక స్థితిలో ఉండగా, నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులైన రుద్రరాపు యాదగిరి, రుద్రరాపు మల్లయ్య, సురారపు యాదగిరి, కొంపల్లి చంద్రమౌళి, కొంపల్లి శ్రీరాములు, రుద్రారపు నర్సింహా, రుద్రారపు కుమార్, తాడోజు శ్రీకాంతరాజు లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపంచారు. వారినుంచి నుంచి 5కర్రలు, ఒక కారు, మూడు బైకులు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డిని, శాలిగౌరారం ఎస్ఐ డి.సైదులును సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.