“నలుగురు నిందితులు అరెస్ట్ మరో ఇద్దరు పరారీ.*.
DSP Sivaram Reddy : ప్రజా దీవెన ,నల్గొండ: తిప్పర్తి పోలీస్ స్టేషన్ నుండి మీడియాకు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి
నల్గొండ పట్టణం రామ్ నగర్ కు చెందిన పాలడుగు రాజు తన లారీని తిప్పర్తి పోలీస్ స్టేషన్ పక్కన గల మార్కెట్ యార్డ్ నందు పార్కింగ్ చేయగా తేదీ 24.12.204 న లారీ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకు వెళ్ళినారని చేసిన ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో Cr.no 232/24 u/s 303(2) BNS కేసు నమోదు చేసుకుని దర్యాప్తు లో భాగంగా సీఐ శాలిగౌరారం, ఎస్ఐ తిప్పర్తి వారి పోలీస్ సిబ్బంది నిన్న సాయంత్రం తిప్పర్తి సెంటర్ లో నకిరేకల్ రోడ్డు వైపు వాహనా తనిఖీలు చేస్తుండగా రెండు ఎర్టిగా కార్లు నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను ఆపి విచారించగా ఇట్టి నలుగురు వ్యక్తులు పోలీస్ లకు పట్టుబడి కాకుండా నంబర్ ప్లేట్ లేని కారులో రాత్రిపూట తిరుగుతూ రహదారుల వెంబడి మీద చీకటి ప్రదేశాల్లో పార్క్ చేసిన లారీలను దొంగతనం చేసి విజయవాడలోనీ ఆటో నగర్ ఏరియాలో ఇట్టి దొంగలించిన లారీలను అమ్మి సులువుగా డబ్బులు సంపాదిస్తామని నేరాన్ని ఒప్పుకున్నారు.
లారీ దొంగతనం కేసును చేదించిన సిఐ శాలిగౌరారం కే. కొండల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పర్తి బి.సాయి ప్రశాంత్ గారిని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, రాము మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారు అభినందించారు