DSP Sreedhar Reddy : ప్రజా దీవెన, కోదాడ: నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పిఏ నంటు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన పంది యాదగిరి హైదరాబాదు లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లుగా తెలిపారు. 6 నెలల క్రితం ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ కు ఫోన్ నెంబర్స్ గూగుల్ సెర్చ్ నుండి తీసుకొని వారికి ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు.
డబ్బులు ఇవ్వని వాళ్ళని బూతులు తిట్టి మహిళలను లైంగికంగా వేధిస్తుండేవాడు .కోదాడ ఐసిడిఎస్ సూపర్వైజర్ కోట సూర్య కళ సెల్ నెంబర్ను గూగుల్లో తీసుకొని ఫోన్ చేసి తాను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ నరేష్ రెడ్డిని చెప్పి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తదుపరి ఆమెను లైంగికంగా వేద పూలకు గురి చేశాడని అంతేకాకుండా హుజూర్నగర్ మేళ్లచెరువు నూతనకల్ నేరేడుచర్ల పరిగి పోలీస్స్టేషన్లో పరిధిలో పనిచేస్తున్న అంగనవాడి సూపర్వైజర్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ను కూడా వేధించేవాడు ఈ విషయమై పలు పోలీస్ స్టేషన్ నందు కేసులు నమోదు అయినట్లుగా తెలిపారు. బుధవారం ఉదయం సమయంలో నిందితుడు బస్సులో విజయవాడ వెళుతున్నట్లు సమాచారం మేరకు కోదాడ టౌన్ సిఐ రాము ఆధ్వర్యంలో కోదాడ టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పంది యాదిగిరిని అదుపులో తీసుకొని విచారణ చేసినట్లుగా తెలిపారు విచారణలో నిందితుడు తన నేరాలను అంగీకరించాడు .
నిందితుడు వద్ద ఒక మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని ఏడు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు ఈ మీడియా సమావేశంలో టౌన్ సిఐ రాము, ఎస్సై రంజిత్ రెడ్డి, ఐడి పార్టీ బాల్తు శ్రీనివాస్, రామారావు, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.