Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Sridhar Reddy: డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన.

DSP Sridhar Reddy: ప్రజా దీవెన ,కోదాడ:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ DSP శ్రీధర్ రెడ్డి (DSP Sridhar Reddy),రూరల్ CI రజితా రెడ్డి (CI Rajitha Reddy)ఆధ్వర్యంలో సోమవారం, మండల పరిధిలోని నల్లబండగూడెం లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా రూరల్ SI అనిల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATMకార్డ్ వివరాలు,OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.

మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ (Blue link)అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని* వేధింపులపై100 నంబర్ కు సమాచారం ఇవ్వాలని తె లిపినారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో కానిస్టేబుళ్ సురేష్, హోం గార్డ్ శ్రీకాంత్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.