DSP Sridhar Reddy: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ గంజాయి రహితం గా మార్చటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి అన్నారు మునగాల మండల పరిధిలోని నర్సింపురం గ్రామ శివారులో ఒక వెంచర్లు గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు నిధులకు సంబంధించిన వివరాలు డిఎస్పి వెల్లడించారు.
కల్వలచెరువు గ్రామానికి చెందిన కొచ్చర్ల ప్రేమ్ కుమార్, నేరేడ్ చర్ల మండలం సోమవరాంనికి చెందిన భీమిశెట్టి మహేష్ చిలుకూరు మండలం పోలేని గూడెం గ్రామానికి చెందిన పసుపులేటి శబరినాథ్ తిరుమగళ్ళ యశ్వంత్ కోదాడ మండలం దొరకుంట గ్రామవాసులు వీరబోయిన మధు కొమ్మ గాని సాయి సతీష్ చావల రాజేష్ పట్టుకున్నట్టు మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన కొచర్ల ఫకీరు ఫరారిలొ ఉన్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి గంజాయి నాలుగు ద్విచక్ర వాహనాలను ఒక సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్సన్ ఉన్నామని తెలిపారు గంజాయి నిందితులు పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన మునగాల సర్కిల్ సిఐ రామకృష్ణారెడ్డి మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.