Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Earthquake : తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

--బయకంపితులై ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు --భూకంపం జరక్ తో ఉక్కిరి బిక్కి రైన ఉభయ ప్రాంతాల ప్రజలు

బిగ్ బ్రేకింగ్

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

–బయకంపితులై ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు
–భూకంపం జరక్ తో ఉక్కిరి బిక్కి రైన ఉభయ ప్రాంతాల ప్రజలు

ప్రజా దీవెన, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఊహించని విధంగా భూకంపం ప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరరయ్యారు. హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, ప్రాంతాల్లో పలు సెకన్లపాటు స్వల్ప భూమి సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించి ప్రకంపనలు సృష్టించింది.

ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందో ళనలకు గురి చేసింది. విజయవాడ లో పలు సెకన్లపాటు భూమి కంపిం చింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామా ల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరం గల్, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల వ్యాప్తంగా భూకంపం వచ్చిం ది.

కొన్ని చోట్ల నిమిషం పాటు స్పల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాం దోళనలకు గుర య్యారు. ఏం జరుగుతుందో అర్థం భయంతో గంద రగోళానికి గుర య్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం లోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించింది. బువారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.

అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్లపాటు భూ మి కంపిం చింది. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. మహ బూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూ కంపం దెబ్బకు కుర్చీలో కూర్చున ప్రజలు సైతం కిందపడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్‌ విద్యాన గర్‌లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావ రిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురా బాద్‌లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు చోట్ల భూ ప్రకంపనలతోభయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు.

వరంగల్ లో స్వల్ప భూకంపం…వరంగల్ లోని పలు ప్రాంతాల్లో 5నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా భూమి కంపిం చిoది. ఉద యాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలోసుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాం పూర్ మండలా ల్లో భూకంపం సంభవించింది. ఐదు సెకండ్ ల పాటు భూమి కంపిం చిది. ఇంట్లో ఉన్న సామాన్లు బీరువాలు బిల్డిం గులు ఊగడం భూమి ఊగినట్టుగా ఆనవాళ్లతో ఒక్కసారిగా భయాందోళన ప్రజలు అప్రమ త్తమయ్యారు.

ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని సెకన్ల పాటు ఇంట్లో వస్తువుల కదలిక రావడంతో ఏం జరుగుతుం దో అని ప్రజలు భయపడ్డారు. ఇక భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంలో సిసి కెమెరాలో భూకంపం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Earthquake