Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raghunandan Rao: కేసిఆర్ పై ఈడి కేసు నమోదు

తెలంగాణలో గొర్రెల కొను గోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు (ఈడీ) కేసు నమోదు చేశారని మెదక్‌ పార్లమెంట్ సభ్యు డు రఘు నందన్‌రావు తెలిపారు.

మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు

ప్రజా దీవెన మెదక్: తెలంగాణలో గొర్రెల కొను గోలు వ్యవహారంలో(sheep distribution scam) మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Directorate of Enforcement) అధికారులు (ఈడీ) కేసు నమోదు చేశారని మెదక్‌ పార్లమెంట్ సభ్యు డు రఘు నందన్‌రావు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తనకు హైదరా బాద్‌ నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. మెదక్‌లో గురువారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, సన్మానస భలో ఆయన మాట్లాడారు. సిద్ది పేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish rao), ఎమ్మె ల్సీ వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యా నించారు. ఈడీ కేసు ప్రభావం వీళ్ల ఇద్దరిపైనా ఉంటుందని పేర్కొ న్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక గెలిచామని విర్రవీగిన ఆరడుగుల హరీశ్‌.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అన్ని ఎన్నికలను డబ్బుతో గెలవలేమని ప్రజలు నిరూ పించారన్నారు. ఎంపీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా వెంకట్రామిరెడ్డి గెలవలేకపోయారని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి ఎంత విలువ ఉంటుందో పూటకు బువ్వ లేని కార్యకర్తకు కూడా తమ పార్టీలో అంతే విలువ ఉంటుందన్నారు. మెదక్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేసి, ప్రధాని మోదీకి గిఫ్ట్‌(Prime minister modi gift) ఇచ్చామ న్నారు. పార్లమెంట్‌లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పిం చిన మెదక్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

ED registers case against KCR