Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Education certificates: అయ్యో పాపం…చదువు సర్టిఫికె ట్లు మున్నేరుపాలు వరదపాలు

–ఖమ్మం వరదలో కొట్టుకుపోయిన దాదాపు 500 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు
— ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలని బాధితుల వినతి

Education certificates: ప్రజా దీవెన, ఖమ్మం: వరదలు నిండా ముంచాయి. వరదలు బతుకును ఛిద్రం చేయడమే కాకుండా అయ్యో పాపం ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హ తల (Education certificates) సర్టిఫికెట్లు మున్నేరుపాల య్యాయి. టెన్త్‌ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టు కుపోయాయి. దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటు న్నారు. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా కొన్ని నేలమట్టమ య్యాయి. ఆదివారం తెల్లవారుజా మున మున్నేరు వరద చుట్టుముట్ట డంతో బాధితులు (victims కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక వచ్చే సరికి వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపో యాయి. మరికొందరికి చెందిన సర్టిఫికెట్లు పూర్తిగా తడిసిపో యాయి.అలాగే పుస్తకాలు, కోచింగ్‌ మెటీరియల్, స్కూల్‌ యూని ఫారాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ లు (Books, coaching material, school uni forms, computers, laptop) కొట్టుకుపోవడం లేదా బురద మయం అయ్యాయి. దీంతో విద్యార్థులంతా కన్నీరుమున్నీరవు తున్నారు. పైచదువులకు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొ నేందుకు సర్టిఫికెట్లు లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పిం చాలని కోరుతున్నారు.ఖమ్మం మున్నేటి ఒడ్డున వెంకటేశ్వరనగ ర్‌లో గట్టు రేణుక టైలరింగ్‌ చేస్తూ ఇద్దరు కూతుర్లను ఉన్నత విద్య చదివించింది. వారిలో తేజశ్రీ మమత మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా పావని అదే కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ మెరిట్‌ స్టూడెంట్స్‌ కావడం తో ఉచిత సీట్లు సంపాదించారు.

తేజశ్రీకి చెందిన ఎంబీబీఎస్, ఇంటర్, టెన్త్‌ సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. ఎంబీబీఎస్‌ (MBBS) స్టడీ మెటీరియల్‌ బురదమయమైంది. పావని సర్టిఫికెట్లు బురదలో కూరుకుపోయాయి. లాప్‌టాప్‌ తోపాటు స్టడీ మెటీరియల్‌ కలిపి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఇంట్లో 90 శాతం మేర సామగ్రి కొట్టుకుపోవడంతో తమను ఆదుకోవాలని రేణుక, వారి పిల్లలు అధికారులను వేడుకుంటున్నారు.

ఖమ్మం వెంకటేశ్వరనగర్‌కు చెందిన పోరండ్ల వినయ్‌కుమార్‌ శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీలో (Vinay Kumar Sri Chaitanya Engineering College) ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఆయనకు ఈ నెల 2న సరి్టఫికెట్లతో రావాలని పిలుపు వచ్చింది. ఇంతలోనే ఆదివారం (1వ తేదీన) వారి ఇంటిని వరద తాకింది. గంటగంటకు వరద తీవ్రత పెరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వినయ్‌కుమా ర్‌ తల్లిదండ్రు లతో కలిసి పునరా వాస కేంద్రానికి వెళ్లగా ఆయన సరి్టఫికెట్లు కొట్టుకుపోయాయి. రూ.70 వేల విలువైన రెండు లాప్‌టాప్‌లు కూడా మున్నేటి పాలయ్యాయి. స్టీల్‌ షాపులో పనిచేస్తూ తనను తల్లిదండ్రులు చదివించారని.. ఇప్పుడు ఉద్యోగానికి ఎలా అర్హత సాధించాలో తెలియడం లేదని వినయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.