Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komati Reddy Venkat Reddy : నల్లగొండ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రయత్నం

–అన్నిరంగాల్లో నల్లగొండను నంబ ర్ వన్ గా నిలపాలన్నదే ధ్యేయo
–నల్గొండలో ఫార్మా కాలేజీ,లా కా లేజీ ఏర్పాటు నా చిరకాల కోరిక
–రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి

Minister Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొం డను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయ మని రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.మూడు దశాబ్దాలుగా ఉ మ్మడి నల్గొండ ప్రజలు తనను ఆశీ ర్వదిస్తూ వస్తున్నారని,వారి ఉన్నతి కోసం ఎంత చేసిన తక్కువే అని మంత్రి భావోద్వేగo చెందారు. డా. బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాల యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అ భివృద్ది,మహాత్మా గాంధీ యూని వర్సిటీ,కాలేజీ,స్కూల్ ఎడ్యుకేషన్ పై ఆ శాఖ ఉన్నతాధికారుతో మం గళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్ర తిష్టాత్మక విశ్వవిద్యాలయమని దా ని ఖ్యాతిని పెంచేలా వీసీ, రిజి స్ట్రా ర్,పాలక సభ్యులు పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించా రు. యూనివర్శిటీకి ప్రత్యేకంగా 60. 22 కోట్ల గ్రాంట్ మంజూరు చేశామ ని,ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేస్తున్ననుం దున కొత్త కోర్సుల పై ఆరా తీశారు. విశ్వవిద్యాలయంలో కొత్తగా ఫార్మ సీ,ఎల్ ఎల్ బి,ఎల్ ఎల్ ఎం లాంటి కోర్సులు ప్రారంభించేందుకు చొరవ చూపాలని వీసీ అల్తాఫ్ హుస్సేన్ మంత్రిని కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి ముఖ్య మంత్రి సహకారంతో విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తేవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూ డా విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు వచ్చారన్నారు. న ల్గొం డలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫా ర్మసి,లా కాలేజీ ఏర్పాటు చేయాల నేది నా చిరకాల కోరికనీ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని త్వరలో నూతన కోర్సులు అందు బాటులోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాలే జ్,స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబం ధించి పలు అంశాలపై చర్చించా రు.డిగ్రీ,జూనియర్ కాలేజీల్లో మౌళి క సదుపాయాలు, హైస్కూల్స్ బలో పేతంపై చర్చించి,అందుకు విద్యాశా ఖ అధికారులు అందించాల్సిన స హకారం పై పలు సూచనలు చేశా రు. ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి తో మాట్లాడి ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు.

ఈ సమీక్షలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా,సాంకేతిక,ఉన్నత విద్యా మండలి కమిషనర్ దేవసే న,మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్,రిజిస్ట్రార్ రవి తదితరులు పాల్గొన్నారు.