Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Election Promises : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచాలి

–విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశిం

–ఈనెల 14వ న వికలాంగుల మాహగర్జన ను జయప్రదం చేయాలని పిలుపు

Election Promises  : ప్రజాదీవెన నల్గొండ :  రాష్ట్రంలోని వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ గడ్డం కాసిం డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నల్లగొండ జిల్లా విహెచ్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగుల పెన్షన్ 6 వేలు, చేయూత పెన్షన్ 4వేలు, తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులకు 15వేలు, వికలాంగులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేస్తామని వికలాంగుల 2016 చట్టం అమలు చేస్తామని స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తావని హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వం ఏర్పాటై 18 ఏళ్లు అవుతున్న వికలాంగుల పెన్షన్, చేయూత పెన్షన్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లమైందని విమర్శించారు. ఈనెల 14వ న నల్లగొండ జిల్లా కేంద్రంలో వికలాంగుల మాహగర్జన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మహగర్జనకు ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు.

కావున జిల్లాలో ప్రతి గ్రామం నుండి వికలాంగుల చేయూత పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, గుద్దేటి సైదులు, శ్రీరామదాసు వెంకట చారి, ఎస్కే అహ్మద్ ఖాన్, విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్య రెడ్డి, విహెచ్పిఎస్ సీనియర్ జిల్లా నాయకులు చిలుముల జలంధర్, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు తుమ్మల లక్ష్మారెడ్డి, మదన్ నాయక్, ఎం. నగేష్, వెంకన్న, గడ్డం ఉపేందర్, నక్క అశోక్, దొండ ఐలయ్య, కట్ట యాదయ్య, ఎస్కే సిద్దవాలి, జె. నగేష్, ఈ. పరమేష్, ముత్తయ్య, ఏ. సైదులు, ఏ. సత్తయ్య, జెల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.