Electric shock : ప్రజా దీవెన, హైదరాబాద్: వేసవి ప్రారంభంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఇది ఏటా జరిగగే ప్రక్రియే. నిరతంర విద్యుత్ సరఫరా కారణంగా ప్రజలు కూడా బిల్లులకు వెరవకుండా వాడేస్తున్నా రు. గత నాలుగైదు రోజులు వాతా వరణంలో కొంత మార్పుతో చల్లగా ఉన్నా మళ్లీ ఎండవేడిమి అందు కుంది. దీంతో వినియోగంలో ఆల్ టైమ్ రికార్డు త్వరలో నమోదుకా నుందని విద్యుత్ వర్గాలు చెబుతు న్నాయి. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ప్రస్తుతం డిమాండ్ అధికమని అంటు న్నా రు. మున్ముందు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు తీసుకుం టున్నట్టు చెబుతున్నారు. విద్యుత్ ప్రసారంలో సమస్యలు రాకుండా చూడాలని సిఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొందరు విద్యుత్ సమస్యలు సృష్టించాలని చూసినా..వెంటనే గుర్తించి అలాంటి వారికి కత్తెర వేశారు. విద్యుత్ వినియోగం పెరగగనుండడంతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంటోంది. అయితే గతేడాది
అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈ నెలాఖరు లోగా 14 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అంతకుమించి విద్యుత్ డిమాండ్ పెరిగింది. అప్పటితో పోలిస్తే కరెంటు కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో ఎండాకాలం ప్రారంభంలోనే రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ పెరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇటు ఉక్కపోత కూడా ప్రారంభం కానుండడంతో కొన్ని రోజుల్లోనే కరెంటు వినియోగం భారీగా అవకాశం ఉందని లెక్క కడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు విద్యుత్ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అలాగే విద్యుత్ నష్టాలను తగ్గించడం కోసం నాణ్యత కలిగిన విూటర్ల ఏర్పాటు, అధిక సామర్ధ్యం ఉన్న కండక్టర్లు మార్చడం వంటివి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్టాల్ల్రో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.