Electric Shock : ప్రజా దీవెన నిజామాబాద్: విధి వక్రీ కరించి ఆ కుటుంబాన్ని బలి తీసు కుంది. కరెంట్ షాక్ తో ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు మృతిచెం దిన విషాద ఘటన తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసు కుంది. భూమాతను నమ్ము కుని సేద్యం చేసే ఓ రైతు కుటుంబం కరెంట్ షాక్ కు బలైంది. ఈ సం ఘటన గురువారం ఉదయం నిజా మాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో జరి గింది. రెంజల్ మండలం సాటా పూర్ గ్రామానికి చెందిన రైతు దంపతులు గంగారం (45), బాల మణి (40) లతో పాటు వారి కొడు కు కిషన్ (22) లు వారి పొలానికి నీరు పారిస్తుండగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగిలింది.
కరెంటు సరఫరా ఆయన సమయంలో తొ లుత గంగారాంకు షాక్ తగల డం తో పక్కనే ఉన్న భార్య బాలమణి భర్తను కాపాడబోయి ఆమె కూడా కరెంట్ షాక్ కు గురయ్యింది. వీరిద్దరికీ కొంచెం దూరంలో ఉండి ఇది గమనించిన కొడుకు పరిగెత్తు కుంటూ వచ్చి తల్లిదండ్రులను కా పాడేందుకు ఇద్దరిని లాగబోయా డు. వెంటనే కొడుకు కూడా షాక్ కు గురికాగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ విజ య్ బాబు, ఎస్ఐ మచ్చేందర్ సం దర్శించి కేసు నమోదు చేరుకున్నా రు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో సాటాపూ ర్ గ్రామంలో విషాదం నెలకొంది.