*కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భాగం మోపితే సహించేది లేదు. షేక్ నయీమ్..
Electricity charges: ప్రజా దీవెన, కోదాడ: కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎన్నికల్లో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన అనంతరం పాలన చేతకాక ప్రజలపై భారాన్ని మోపితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కోదాడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ నయీమ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress party) ప్రజలపై 18500 కోట్లు విద్యుత్ చార్జీల భారాన్ని మోపెందుకు సిద్ధమవగా చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బి ఆర్ ఎస్ పార్టీ పోరాటం చేసి విద్యుత్ భారాన్ని (Electrical load) ఆపడంలో విజయం సాధించింది తెలిపారు.చార్జీల పెంపుపై (Increase in charges) జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో తమ నేత కేటీఆర్ పాల్గొని చార్జీల పెంపును వ్యతిరేకించారని ఇది తెలంగాణ ప్రజల విజయమని తెలిపారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని 6 గ్యారంటీ ల పేరుతో ప్రభుత్వం ప్రజలు అందరినీ మోసం చేసిందని ప్రజలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల అధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి (Nalla Bhupal Reddy), చింతల నాగేశ్వరరావు, సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, షేక్ అలీమ్, దొంగరి శ్రీను, చలిగంటి వెంకట్, బొజ్జా గోపి, షేక్ అబ్బు, షేక్ ఆరీఫ్, గొర్రె రాజేష్, గంధం శ్రీను, సురేష్ జానీ, బుచ్చిబాబు, తిరుపతిరావు, మాదాల ఉపేందర్, మహింద్ర యూత్ అధ్యక్షుడు లాజర్, బీపీయల్ జానీ, షేక్ నిస్సార్, సద్దామ్, బాదే రామారావు బెల్లంకొండ ఏడుకొండలు, జి. సైదులు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.