–కేసీఆర్ లేఖలో ఆయన చెప్పిన సమాధానాలను పరిశీలిస్తాం
–విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి
electricity : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో (TELANGANA) విద్యుత్తు విచారణ వివాదం రోజు రోజుకు చిలికి చిలికి గాలివా నలా మారితోంది. విద్యుత్ కొనుగో ళ్లు, విద్యుత్ కేంద్రాల (electricity CENTERS)ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం నిర్ణయా లపై జ్యుడీషి యల్ కమిషన్ చేపట్టి న దర్యాప్తు రాజకీయ రంగు పులు ముకుంది. కమిషన్ కు వివరణ ఇస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ (kcr) రాసిన లేఖలో కమిషన్ చట్టబద్దతను ప్రశ్నిం చిన విషయం తెలిసిందే. కమిషన్ నుం చి స్వచ్ఛందంగా తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ కోరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేప థ్యంలో కేసీఆర్ లేఖపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) స్పందించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (kcr) రాసిన లేఖ అందిందని ఆ లేఖపై నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందని తెలిపారు. ఆ లేఖపై మంగళవారం సమీక్ష చేస్తామన్నారు. అనంతరం తదు పరిచర్యలు ఉంటాయని చెప్పా రు. లేఖలో కేసీఆర్ కొన్ని ప్రశ్నల కు సమాధానం ఇచ్చారని, ఆయ న చెప్పిన వివ రాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. దీనిపై బీహెచ్ ఈహెచ్ ప్రతినిధులను సైతం వివరాలు కోరు తామన్నారు. అలాగే లేఖలో కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలపై పునః పరిశీలన చేస్తామని చెప్పారు.