Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Urban Employment Guarantee : ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి

Urban Employment Guarantee :  ప్రజాదీవెన నల్గొండ టౌన్ :  గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి 200 రోజులకు పని దినాలు పెంచి రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు లో వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మికుల కోసం, రైతుల కోసం కార్మికుల కోసం తన చివరి శ్వాస వరకు వారి హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని అన్నారు.

 

తన భూమిని నిరుపేదలకు పంచి, కులమత బేధాలు లేని సమాజం కోరుకున్న ఉత్తమమైన నాయకుడని పేర్కొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 1936లో వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం వారి జీవన విధానం మెరుగుపడాలని వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తన జీవితం మొత్తం కూలీల కోసం పేదల కోసం దేశ ప్రజల కోసం అంకితమిచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి దేశ ప్రజల కోసం పిల్లల్ని కనకుండా తన జీవితాన్ని దేశానికి అంకితం ఇచ్చాడని ఆయన జీవితాన్ని ఇప్పుడున్న యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీలో పని చేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఈ విధానాలపై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ ఉపాధ్యక్షులు పనస చంద్రయ్య, రైతు సంఘం పట్టణ నాయకులు దండెంపల్లి యాదయ్య, పల్లె నగేష్ సిరిశాల కుమార్, దూదిమెట్ల వెంకన్న, పామనగుండ్ల రాజు ఆంజనేయులు, వెంకన్న, పార్వతమ్మ, మాధవి, కళమ్మ, తదితరులు పాల్గొన్నారు.