English Olympiad : ప్రజా దీవెన, శాలిగౌరారం: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలలో శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న పాక శ్రీవిద్య జిల్లా ప్రథమ బహుమతి పొందారు,ఈ సందర్భంగా ఆంగ్ల విభాగాధిపతి చిత్తలూరి సత్యనారాయణ మాట్లాడుతూ.
ఈ ఆధునిక సమాజంలో ఆంగ్ల విద్య ఆవశ్యకత ఎంతో ఉందని,ఆ దిశగా మేము ప్రయత్నంచేస్తున్నామనడానికి ఇలాంటి ఫలితాలు నిరూపిస్తొయని పేర్కొన్నారు,ఈ సందర్భంగా పాక శ్రీవిద్య ను పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ, సంధ్యారాణి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు