Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Esophagus : బ్రాహ్మణుల ఆచమనంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం..అదేమిటో తెలుసా

ప్రజా దీవెన, హైదరాబాద్: భోజనానికి ముందు బ్రాహ్మణులు ఆచ మనం చేయడం వెనుక వున్న ఆరో గ్య రహస్యం ఇదేనా ఎసో ఫెగస్ (Esophagus ) అనేది మన గొం తుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మిత మై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారంలోనికి తీసుకు నేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయ టకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉం టుంది. ఏసిడ్ బయటకి లీక్ అ య్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్ సాఫీగా తెరుచుకో వడానికి బ్రాహ్మణులు చేసే “ఆచమ నం” అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే ఎసోఫె గస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు. అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెసుని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి.

గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. ఎందుకంటే, “కేశవ” నామం గొంతులోనుంచీ వస్తుంది. “నారాయణ” నామం నాలిక సహాయంతో వస్తుంది. “మాధవ” నామం పెదాల సహకారంతో వస్తుంది. అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజు అన్న మాట.

మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా? మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.

ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి. ఒక శాస్త్రీయ విధానాన్ని సింపులుగా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢన మ్మకం మరొకటి వుండదేమో అని ప్రజా దీవెన సేకరించిన సమాచారం మేరకు తెలుస్తోంది.