ఎస్సారెస్పీ కాలువలో పడిన దుప్పి
ప్రజా దీవెన/ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామ శివారు లోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు బుధవారం ఉదయం దుప్పి కాలువ లో పడిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అంలోనే కాలువలో పడిపోయిన దుప్పిని గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాలువ నుండి దుప్పి బయటికి రాలేక కొద్దిసేపు ఇబ్బంది పెట్టింది, గ్రామ యువకులు పట్టుదలతో దాన్ని బయటకు తీయడంతో ప్రాణాలతో బతికి బయటపడింది.