ప్రజా దీవెన, మల్కాజిగిరి:బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నా సదుపాయాలపై ఆరాతీస్తూ, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు సిబ్బంది సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు.అవుట్ పేషంట్ విభాగంలో డాక్టర్స్, సిబ్బంది అందరినీ కలిశారు.ఇన్ పేషంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడారు.వారికి వచ్చిన జబ్బు, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాత్ రూంలు కూడా పరిశీలించారు.. శుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఎంపీ గారి దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యలు :
ఆల్ట్రాసౌండ్ లేదు.రేబిస్ వాక్సిన్ లేదు.మందులు అందుబాటులో లేవు.X రే, బ్లడ్ టెస్టులకు డబ్బులు తీసుకుంటున్నారు.రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు అత్యవసర పరిస్థితులలో ఇబ్బంది అవుతుందని ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళటం కంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావడమే మంచిదనీ వస్తున్నాం. కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరిన పేషెంట్లు.హాస్పిటల్ నడవడానికి అవసమైనన్ని నిధులు లేవని తెలిపిన సిబ్బంది.
పరిశీలన తరువాత ఈటల మీడియాతో మాట్లాడుతూ ..ప్రభుత్వ ఆసుపత్రులకు కడు బీదరికం ఉన్నవారు మాత్రమే వస్తున్నారు.
వచ్చేవారికి చికిత్స, మందులు అందించడం కోసం డాక్టర్లు నర్సులు సరిగ్గా అందుబాటులో లేరు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు నేను హాస్పిటల్ విజట్ చేశాను. గాంధీ, ఉస్మానియా లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గుపోయి ఇబ్బంది పడుతున్నారని దృష్టికి వచ్చింది. మల్కాజ్గిరి పరిధిలోని కంటోన్మెంట్ హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించి ప్రజలు సిబ్బందితో మాట్లాడాను. డాక్టర్ కి చూపించడానికి 50 రూపాయలు సర్వీస్ చార్జీలు పెట్టారు.
పూర్తి స్థాయిలో మందులు అందించే ప్రయత్నం చేస్తాము. డెలివరీలు తక్కువ అవుతున్నాయి.. నెలకు 4-5 మాత్రమే అవుతున్నాయి.
పెంచే ప్రయత్నం చేస్తాం.ఇది కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఆసుపత్రి.. ఎంపీగా నేను కూడా కంటోన్మెంట్ బోర్డులో మెంబర్ని కాబట్టి డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, మందులు సంపూర్ణంగా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది పురాతనమైన పేరున్న ఆసుపత్రి.ఈ ప్రాంత ప్రజలకి రూపాయి భారం లేకుండా ఆరోగ్యం అందించే ప్రయత్నం చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు.