*మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్*
Etala Rajender : ప్రజా దీవెన,మేడ్చల్ మల్కాజిగిరి: కొంపల్లి నుండి మేడ్చల్ హైవే రోడ్ వైడెనింగ్ పనులు జరుగుతుండగా ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్న కారణంతో రోడ్డు పనులను పర్యవేక్షించి వేగంగా పనులు పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ నుండి విముక్తి చేయాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.
బోయినపల్లి నుండి కాలకల్ వరకు వెయ్యికోట్లతో కేంద్రప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేస్తుంది.
2025 నవంబర్ వరకు ఈ పనులు పూర్తి అవ్వాలని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు
అప్పటివరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలివ్వడం జరిగింది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పి. విక్రమ్ రెడ్డి గారు, బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారు, మేడ్చల్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ అమరం మోహన్ గారు మరియు పలువురు పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.