Etela Rajender: ప్రజా దీవెన, హైద్రాబాద్: అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ….హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి, దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక గొప్ప విజనరీతో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. 70-80 ఏళ్లు రైల్వే స్టేషన్లు పాతబడుతున్నప్పటికీ కేవలం రూ. 5 -10 కోట్లతో తూతూమంత్రంగా మెరుగులు దిద్దే పనులు జరిగాయి తప్పితే ఎక్కడా కూడా సంపూర్ణంగా అభివృద్ధి జరగలేదు.
పెరిగిన జనాభా, వారి అవసరాలకు తోడుగా గొప్పగా నిర్మాణం జరగాల్సిన రైల్వేస్టేషన్లు..దుర్గంధ పూరితంగా తయారయ్యాయి.నేడు దేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పోటీపడే విదంగా మోడ్రన్ రైల్వేస్టేషన్లు నిర్మాణం జరుగుతున్నాయి. కాజీపేట -బల్లార్షా వరకు 4 లైన్ల నిర్మాణం చేపట్టింది.దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుదీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి.సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ. 2 వేల కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఎయిర్ పోర్టుల తరహాలో అభివృద్ధి చేయడం శుభపరిణామం.
మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం అనేక రైల్వేలైన్లకు నిలయం. రైల్వే ప్రాపర్టీస్, రైల్వే ఉద్యోగుల నిలయంగా ఉంది.మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇంత గొప్పగా నిర్మాణం జరగడంతో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందనున్నాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.