Etela Rajende : ప్రజా దీవెన ,మల్కాజ్గిరి : తొమ్మిది అసెంబ్లీ( ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, హుజూరాబాద్, గజ్వేల్) నియోజకవర్గాల్లో నిరుద్యోగ సర్వే మొదలు పెట్టిన ఈటల రాజేందర్.
నెలకు వెయ్యి ఉద్యోగాల కల్పన లక్ష్యం,నిరుద్యోగ రహిత నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడం నా లక్ష్యం అంటున్న ఈటల,ఇందుకోసం నిపుణ ఎన్జీఓ సమన్వయంతో ఎంప్లాయిమెంట్ సెల్ ను ప్రారంభించారు.
*నిరుద్యోగరహిత మల్కాజ్గిరి పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా షామీర్ పేట నివాసంలో ఆయన మాట్లాడుతూ : నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి నిత్యం ఏరుకుంటున్న సమస్య నిరుదోగ్య సమస్య,ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు,కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈసమస్యపరిష్కారానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు. ఈ యువతకు పని కలిపించాలి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని సంకల్పించారు.నేనుగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో,హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఈరోజు నుండి ఇంటింటికి సర్వేనిర్వహిస్తారు. ఎవరెవరు నిరుద్యోగులున్నారు వారికి ఎలాంటి ఉద్యోగాలు కావాలి నివేదిక రూపొందిస్తారు. ప్రతి నెల వెయ్యికి తగ్గకుండా ఉద్యోగాలు కలిపించడమే ఈ సంస్థ లక్ష్యం.
మా నియోజకవర్గంలో అనేక కంపెనీలు ఉన్నాయి వాటిల్లో ఉద్యోగాలు కల్పించదమే మా ఎజెండా నిరుద్యోగ రహిత పార్లమెంట్ నియోజకవర్గంగా తయారుచేయడమే నా లక్ష్యం. దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి,స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెడతాం,ఇక్కడే కాదు విదేశాల్లో కూడా నర్సులు, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేస్తున్నాం.