— మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
Etela Rajender: ప్రజా దీవెన, హైదరాబాద్: మల్కా జ్ గిరి నియోజకవర్గ ప్రజ లకు ఒక సేవకుడిలా ప్రజాసేవ చేస్తానని పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ (Etela Rajender) తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో ఈటల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రజల వద్దకే వచ్చి కృతజ్ఞతలు తెలిపే కార్యక్ర మo జిహెచ్ఎంసి (ghmc) డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సిం హ్మా రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించారు.వాకర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో చెట్ల మొ క్కలు నాటిన అనంతరం వివిధ కాలనీల సంక్షేమ సభ్యులతో మ ల్కాజ్ గిరి పార్లమెంట్ (Malkaz Giri Parliament) సభ్యుదు ఈటల రాజేందర్ సమావేశమై పార్ల మెంట్ ఎన్నికలలో ఆశీర్వ దించిన ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతాభి వందనాలు తన ఉప న్యాసంలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్ గిరి పార్ల మెంట్ (Malkaz Giri Parliament) ఎన్నికలలో నియోజకవర్గ ప్రజానీకం నా పై ఎంత నమ్మకంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో అంతే బాధ్యతగా మంచి సంక్షేమ పాలన రాజకీయాలకతీ తంగా అందిస్తానని అన్నారు. తమ ప్రాం తాలను అభివృద్ధి చేయడానికి కార్పొరేటర్లకు పూర్తి సహకారం ఉం టుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాయకత్వ సహకారంతో చట్టస భల్లో మంచి విప్లవాత్మక మార్పులు చేసే దానిలో మా నాయకుడు ఉం టాడని తల ఎత్తుకునేలానా నియో జవర్గ ప్రజలు చెప్పుకునే విధంగా పేరు తెచ్చుకుంటానని పేర్కొన్నా రు.తన గెలుపులో కీలక బాధ్యత లు నిర్వహించిన నాయ కులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాల నాయకులకు, మరియు ఓట్లు వేసిన గెలిపించిన మల్కాజ్గిరి ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామారంగారెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్,వివిధ కాలనీల సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.