–ఎంజియు ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
MGU University : ప్రజా దీవెన, నల్లగొండ: ఐ పి ఆర్ సెల్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం నల్లగొండ, శాస్త్ర సాంకేతిక మం త్రిత్వ శాఖ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా ఉపకుల పతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సే న్ హాజరైన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల వినూత్న ఆలోచన ఆచరణాత్మక దృక్పధానికి క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శా స్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించ డం సులువని అన్నారు.
సామాజిక సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గా లు కనుగొనాల్సిన బాధ్యత విశ్వవి ద్యాలయాలపై ఉందని అన్నారు. అనంతరం నల్సార్ హైదరాబాద్ నల్సర్ విశ్వవిద్యాలయం అధ్యాప కులు శ్రీమతి నివేద, శ్రీ చరణ్ తేజ్లు మేధో సంపత్తి హక్కుల పై విద్యార్థు లకు వివరించారు. ఈ సందర్భంగా నివేద మాట్లాడుతూ మేధో సంపత్తి హక్కుల చరిత్ర పూర్వాపరాలు మార్కెట్లో జరుగుతున్న మోసా లపై , ట్రేడ్ మార్కులు, సంపత్తి హక్కులపై విద్యార్థులకు వివరిం చారు. అనంతరం చరణ్ తేజ్ మా ట్లాడుతూ మేదో సంపత్తి హక్కుల దరఖాస్తు పేటెంట్ పొందే విధానం దాని ఆవశ్యకతలను ఉదాహరణల తో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐపిఆర్ సెల్ డై రెక్టర్ దోమల రమేష్, సైన్స్ కళా శా ల ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్సాగర్, డా రామచందర్ గౌడ్, డా మదిలేటి, డా తిరుమల డా శాంతకుమారి, డా మ చ్ఛేందర్ తదితర అధ్యాపకులు వి ద్యార్థులు పాల్గొన్నారు.