Lakshma Reddy : ప్రజా దీవెన, కోదాడ: గణపవరం గ్రామ ప్రజలు స్వామి వారి భక్తులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భక్తి భావంతో కలిగి స్వామిని పూజించాలని వరవర రంగనాయక స్వామి దేవాలయ చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వేంచేసియున్న వరవర రంగానాయక స్వామి దేవాలయంలో పవిత్రోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం దేవాలయ ప్రాంగణంలో ద్వారా తోరణ పూజ మూర్తి కుంభ ఆరాధన మూలమంత్రం హోమం నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా కనులకు విందుగా న మూలమంత్ర హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే నిత్య పూర్ణాహుతి తీర్థ ప్రసాద వితరణ వేద పండితులు యాజమాన్యులకు భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు
ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వరవర రంగనాయక స్వామి దేవాలయంలో గత ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పవిత్రోత్సవ కార్యక్రమాలను గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామని ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారని తెలిపారు ఈ పవిత్సోవం కార్యక్రమం వలన గ్రామానికి గ్రామ ప్రజలకు శుభం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ధర్మకర్తలు బల్గూరి సైదులు ,ఉల్లి నాగలక్ష్మి , లింగంపల్లి బిక్షం శ్రీ సాయిని సీతయ్య , కంపసాటి నాగేశ్వరరావు, కుక్కడపు గురవయ్య ,ఎక్స్ ఆఫీషయా నెంబర్ నల్లతీగ కృష్ణమాచార్యులు గ్రామ పెద్దలు ఇర్ల సీతారాంరెడ్డి, దేవా ,పుష్పమ్మ ,మంగమ్మ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు