Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ex CS somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ పై కేసు

--జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం --పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో కేసు

మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ పై కేసు

–జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం
–పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో కేసు

ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణ లో జీఎస్టీ ( gst) కుంభకో ణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సదరు కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ (cs som esh Kumar) ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు (ccs police) కేసు నమోదు చేశారు. పన్ను ఎగవే తదార్లకు సహక రించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయిన విషయం తెలిసిందే.

వాణిజ్య పన్నుల శాఖ ( comarc ial taxes) అడిషనల్ కమిష నర్‌ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూ టీ కమిషనర్‌ శివ రామప్రసా ద్, ఐఐటీ హైదరాబాద్‌ ( iit Hydera bad) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ( tax) ఎగవేతలు జరిగినట్టుగా సమాచారం.

ఒక్క తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌( telangana bevera ges corporation) ఎగవేత ద్వారా ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదా పు రూ. 400కోట్లు పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు.

మరోవైపు మానవ వనరులను అందించే ‘బిగ్‌లీప్‌ టెక్నాల జీస్‌ అండ్‌ సొల్యూ షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఏమాత్రం టాక్స్‌ కట్టకుండానే ఏకంగా రూ.2 5.51కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకుందని, అవ కతవకలు జరి గాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాణిజ్యపన్నులశా ఖకు సాంకే తికతను అందించే సర్వీస్‌ ప్రొవైడ ర్‌గా ఐఐటీ హైదరాబాద్‌ వ్యవహ రించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ ( it returns) ల్లో అక్రమా లను గుర్తించడం తో పాటు డేటాను విశ్లేషించడం సర్వీస్‌ ప్రొవైడర్‌ చే యాల్సిన పని. పన్నుచెల్లింపు దారుల్లో ఎవరైనా అక్ర మాలకు పాల్పడితే సర్వీస్‌ ప్రొవైడర్‌ రూపొందించిన ‘స్క్రూటినీ మా డ్యూల్‌’ గుర్తించాల్సి ఉంటుంది.

కానీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ (bigleaf technologys) అక్రమాలను ఐఐటీ హైదరాబాద్‌ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ ‘స్క్రూటినీ మాడ్యూల్’ కూడా గుర్తించలేకపో యిందని వివరించారు.

Ex CS somesh Kumar