ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతున్న దామెర గ్రామస్తులు
Excursion : ప్రజా దీవెన నాంపల్లి జనవరి 12 విజ్ఞాన విహార యాత్రలో భాగంగా శనివారం రోజున దామెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల విద్యార్థులను హైదరాబాదులోని పర్యాటక కేంద్రాలైన సాలార్జంగ్ మ్యూజియం చార్మి ర్ నెహ్రు జువాలజికల్ పార్క్ దుర్గం చెరువు తెలంగాణ రాష్ట్ర సచివాలయం బుద్ధ విగ్రహం అమరుల జ్యోతి కేంద్రాలను విద్యార్థులకు చూపించి అక్కడి విషయాలను గైడ్స్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరo ప్రత్యేకంగా ప్రజా దీవెన ప్రతినిధితో మాట్లాడుతూ విద్యార్థు లు విహార యాత్ర లు చేయడంలో ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తారని తమ తమ జీవితాలలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయని.
తమ తోటి విద్యార్థులకు తెలియజేస్తారని అన్నారు యాత్రలకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులను దామెర మాజీ వార్డ్ నెంబర్ దామెర ఉత్తరయ్య అభినందనలు తెలియజేశారు దామెర గ్రామస్తులు ఉపాధ్యాయుల నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యాదయ్య రమణ ఇమామ్ జ్యోతి శ్రీహరి మహేష్ ఉజ్వల శ్రవణ్ శిరీష రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు