Excursion to Papikonda: పర్యాటకులకు అదిరిపోయే తీపి కబురు…ప్రకృతి ఒడిలో పరవశించే సమ యం ఆసన్నం…పాపికొండలు విహారయాత్ర ప్రారంభం
Excursion to Papikonda: ప్రజా దీవెన పాపికొండలు: దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర (Excursion to Papikonda) మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీ పట్నం మండలంలో పాపికొండలు విహారయాత్ర మొదలైంది. అదే సందర్భంలో గండిపోచమ్మ బోట్ పాయింట్ (Gandipochamma Boat Point) నుండి పాపికొండలు పర్యటనకు వెళ్లారు పలువురు టూరిస్టులు. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహారయాత్ర స్టార్ట్ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు కావేరి బోట్లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య తొలిరోజు పాపికొండల విహారయాత్ర కొనసాగించారు టూరిస్టులు. పర్యాటకులు తరలిరావడంతో గండిపోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహారయాత్రకు వెళ్లింది.లైఫ్ జాకెట్లతో పాటు ప్ర త్యేక తనిఖీలు తర్వాత బోట్‌కు అనుమతిచ్చారు పర్యాటక శాఖ అధికారులు. నాలుగు నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర ప్రారంభమవడంతో ఇకపై పర్యాట కుల తాకిడి పెరగనుంది. ఈ క్రమంలోనే పాపికొండలు పర్యట నకు (Tour of Papikondalu) 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్ ఇచ్చారు పర్యాటక శాఖ అధి కారులు. గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు విహా రయాత్ర కొనసాగుతుంది. ఫిర్యా దులు వస్తే కఠిన చర్యలు, పాపి కొండల టూర్‌కు అనుమతి ఇవ్వ డంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతో పాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీ లించారు.
బోట్ల ఫిట్నెస్, లైసెన్స్ రికార్డులను (Boat fitness and license records) వెరిఫై చేసి.. బోటులో గోదావరిలో షికారు చేశారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. ఈ సందర్భంగా.. టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపి కొండల టూర్‌కు వచ్చే పర్యాటకుల కు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు సూచించా రు. ఒకవేళ పర్యాటకుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ అటు.. ప్రభుత్వ అనుమతులతో ఇకపై.. పాపికొండల్లో బోట్లు కంటిన్యూగా అందుబాటులో ఉంటాయని.. పర్యాటక ప్రియులు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు నిర్వా హకులు.