–సిఐటియు
BLO Duties : ప్రజాదీవెన నల్గొండ : గర్భిణీలు, బాలింతలు, మాతా శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అదనపు భారంగా ఉన్న బిఎల్ఓ డ్యూటీలను మినహాయింపు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, టౌన్ కన్వీనర్ అవుట రవీందర్ తెలిపారు.గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ లో జరుగుతున్న బిఎల్ఓ శిక్షణ కార్యక్రమం దగ్గర ట్రైనింగ్ ఆఫీసర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి 12న డిప్యూటీ సెక్రటరీ అంగన్వాడి సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్స్ కు, హెల్పర్లకు బిఎల్ఓ డ్యూటీ ల నుండి మినహాయించి వారికి పని ఒత్తిడి లేకుండా చూడాలని ఫైల్ నెంబర్ /4/2023-cd-1 (e104875)12-03-2025 సర్కులర్ జారీ చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పటికే అంగన్వాడీలకు పోశం ట్రాకర్ రకరకాల యాప్ ల ద్వారా బరువు కొలతలు పోషకాహారాల పంపిణీ అన్ని ఆన్లైన్ లో వివిధ యాప్ ల ద్వారా పనులు చేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. అదనంగా బూత్ లెవెల్ ఆఫీసర్గా ఓటర్ లిస్ట్ ల నమోదు తొలగింపులు, మార్పులు చేర్పు లాంటి ఆన్లైన్ పనులు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంగన్వాడి సర్వీసెస్ డిప్యూటీ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను బిఎల్వోల డ్యూటీల నుండి వినాయక చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నలగొండ ప్రాజెక్టు నాయకులు పి. సరిత, కె. సునంద, పాతూరి లక్ష్మి, ప్రకృతాంబ, రేణుక నాగమణి, నాగలక్ష్మి, మనీషా, బాలజ్యోతి, భారతి, సునీత, నాగమ్మ, భాగ్య, విజయలక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.