తెలంగాణ లో వైద్య సేవలు మరింత విస్తృతం
13 జిల్లాల్లో రేడియాలజీ పరీక్షలు 8 జిల్లాల్లో పాథాలజీ వైద్య పరీక్షలు నేటి నుంచి టి డయాగ్నస్టిక్స్ విస్తరణ
తెలంగాణ లో వైద్య సేవలు మరింత విస్తృతం
13 జిల్లాల్లో రేడియాలజీ పరీక్షలు
8 జిల్లాల్లో పాథాలజీ వైద్య పరీక్షలు
నేటి నుంచి టి డయాగ్నస్టిక్స్ విస్తరణ
ప్రజా దీవెన/ హైదారాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే. ఈ పాటికే తెలంగాణ లోని దాదాపు జిల్లాల్లోని ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు నిష్టాతులైన వైద్యులు,వైద్య సిబ్బందిని నియమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలకు మంచి ఆదరణ రావడంతో సదరు సేవలను మరింత విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ-డయాగ్నస్టిక్స్‌లో ప్రస్తుతం అందిస్తున్న 57 రకాల టెస్టుల సంఖ్యను దాదాపు 134కు పెంచడం తో పాటు 8 జిల్లాల్లో పాథాలజీ ల్యాబులు, 13 జిల్లాల్లో రేడియాలజి హబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టులు ప్రైవేట్ ల్యాబ్స్‌లో చేయిస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఖరీదు ఉంటుంది. ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, తలసేమియా, హీమోఫీలియా, అనీమియా, కాలాఅజార్ వంటి వ్యాధులను గుర్తించే పరీక్షలతో పాటు.. హెచ్ఐవీ టెస్ట్, వైరల్ లోడ్ టెస్టులు రోగులకు ఉచితంగానే అందుబాటులోకి రానున్నాయి. కొత్త టెస్టులు, ప్యాథాలజీ ల్యాబులు, రేడియాలజీ హబ్‌లను రంగారెడ్డి జిల్లా కొండాపూర్ దవాఖానాలో ఏకం కాలంలో వర్చువల్ పద్ధతిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట, యాదాద్రా భువనగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాలలో కొత్తగా పాథాలజీ హబ్‌లు రానున్నాయి. హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, నర్సంపేట, వనపర్తి, రంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేటల్లో రేడియాలజీ హబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.4.39 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ల్యాబుల నిర్వహణకు ఇప్పటికే రూ.2.40 కోట్ల వ్యయం అవుతుండగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.60 లక్షల మేర భారం పడనున్నది.
టీ-డయాగ్నస్టిక్స్ ప్రారంభించిన తర్వాత 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలోని 57,68,523 మంది రోగులు ఈ ఉచిత పరీక్షలను ఉపయోగించుకున్నారు. టీ-డయాగ్నోస్టిక్స్‌లో 1,11,49,991 నమూనాలను సేకరించి.. 2,07,91,200 ప్రొఫైల్స్.. 10,40,36,082 పరీక్షలు నిర్వహించారు. దీని వల్ల పేదలకు జు పరీక్షల భారం తగ్గడమే కాకుండా.. 24 గంటల్లోపే ఫలితాలు వస్తుండటంతో వైద్య సేవల్లో ఆలస్యం కూడా తగ్గింది.
హైదరాబాద్‌లోని సెంట్రల్ ల్యాబ్‌తో పాటు 15 స్పోక్స్‌తో టీ-డయాగ్నస్టిక్స్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు సెంట్రల్ ల్యాబ్‌తో పాటు 19 మినీ హబ్‌లు, 435 స్పోక్స్‌కు సేవలు విస్తరించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ ల్యాబ్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండటంతో ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ వచ్చింది. 13 జిల్లా ల్యాబులకు కూడా ఎన్ఏబీఎల్ ప్రాథమిక అక్రిడిటేషన్ వచ్చింది.