Eye Donation : ప్రజాదీవెన, నల్గొండ : కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామం కామ్రేడ్ జీనుకుంట్ల లింగయ్య మాజీ సర్పంచ్ చనిపోయినారని సమాచారం అందిన వెంటనే వీరి కుటుంబ సభ్యులు కృష్ణయ్య, సైదులు, కమలాకర్, మరియు బందు మిత్రులు పాపయ్య, రాములు, ఆంజనేయులు, శివ, వెంకటేష్, సైదులు, నవీన్, చెన్నకేశవులు, లక్ష్మణ్ ల సహకారంతో నేత్రదానం చేయడం జరిగినది.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ “ఐ డొనేషన్ సెంటర్” కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల, టెక్నీషియన్ జానీ దాత ఇంటి వద్దకు వెళ్లి రాత్రి 11 గంటలకు నేత్రదానాన్ని సేకరించారు.
మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలెనని ఒకవేళ పార్ధీవ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించ వచ్చునని, మరణానంతరం నేత్రదానం చేసినవారికి మోక్ష సిద్ధి లభిస్తుందని “వాల్మీకి రామాయణం, అయోధ్య కాండ 12వ సర్గ, శ్లోకం నెంబర్ 43” లో అలానే, అన్ని మత గ్రంథాలలో కూడా వ్రాయబడి ఉందని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల తెలిపారు. నేత్రదానం పై మరింత సమాచారం కొరకు తమ నెంబర్ 9948143299 నందు సంప్రదించవలనని కోరారు. నేత్రదానం కొరకు మమ్మల్ని 24/7 సంప్రదించవచ్చని తెలిపారు.
తమ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆగష్టు నుండి ఇప్పటివరకు 71 మంది పార్థివ దేహాల నుండి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో, 142 కార్నియాలను సేకరించామని వీటి ద్వారా 142 మంది కార్నియా అంధులకు కంటిచూపును ప్రసాదించడం జరిగినదని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, చైర్మన్ కెవి ప్రసాద్ తెలిపారు. ఐడొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్, లయన్ శైలజ మాట్లాడుతూ ప్రస్తుతము ఉన్న సమాచారం ప్రకారం భారతదేశం లో 75 లక్షల నుండి 95 లక్షల మంది అంధులు ఉంటే, వీరిలో 13 లక్షల నుండి 15 లక్షల మంది కార్నియా అను కంటి పోర లేకపోవడం వల్ల అంధులు గా వున్నారని, అయితే ప్రస్తుతము మనం దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 45987 కంటి పొరలను సేకరించి కంటి చూపు తెప్పించగలుతున్నామని, కానీ ప్రతీ సంవత్సరం కొత్తగా 28409 మంది కార్నియా అంధత్వం తో రిజిస్టర్ అవుతున్నారని అందుకే నేత్రదాన ఉద్యమం మరింత ప్రచారం చేయాలని తెలిపారు.
ఈ సందర్బంగా మేనేజర్ డాక్టర్ ఏ. సి హెచ్ పుల్లారావు మాట్లాడుతూ సేకరించిన నేత్రాలను (కార్నియా అను కంటి పొర లను) హైదరాబాదులోని ఐ బ్యాంక్ లకు పంపించి, 72 గంటలలోగా కెరిటోప్లాస్టి ఆపరేషన్ చేయించి కార్నియల్ అంధులకు కంటిచూపు తెప్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో
లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామొర యాదయ్య, డాక్టర్ ప్రవీణ్ ,డాక్టర్ రమేష్, ఇతర సభ్యులు నేత్రదాతల కుటుంబ సభ్యులను అభినందించారు.