Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Ravindra Kumar Nayak : రాజకీయ దుర్దేశంతోనే లేనిపోని రాద్దాంతాలు

–సీఎం వస్తుండoటే ఎందరో ఏదో వస్తుందని ఎదురుచూస్తారు
–పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలతో సీఎం దిగజారి మాట్లాడారు
–రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రి యని అందరికీ తెలిసిందే
–ఇష్టంలేని ప్రజలను బలవంతంగా సభకు తీసుకొచ్చారు
–బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీం ద్ర కుమార్ నాయక్

BRS Ravindra Kumar Nayak : ప్రజాదీవెన, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభలో రేవంత్ రె డ్డి బిఆరెస్ పార్టీపై రాజకీయ దురు ద్దేశoతో మాట్లాడారని, ముఖ్యమం త్రి హోదాను మరిచి రేవంత్ రెడ్డి త న ప్రసంగం కొనసాగించారని టిఆ ర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీ వ్రస్థాయిలో విమర్శించారు.కెసిఆ ర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లపై అవాకులు, చవాకులు మాట్లాడడం తగదని హితవు పలి కారు. సీఎం వస్తుండు అంటే ఎదో అభివృద్ధి పథకలు వస్తాయని ప్రజ లు భావిస్తారు. కానీ వ్యక్తి గత ఆరో పణలతో సీఎం స్థాయి దిగజారి మా ట్లాడారు.రేషన్ కార్డ్స్ జారీ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియనే. ఎప్ప టి నుంచే జరిగేదే. కానీ కొత్తగా ఇపు డే ఎదో పథకం ప్రారంభిస్తున్నట్లు ప్ర భుత్వ సొమ్ము దుర్వినియోగం చే సారని ఆరోపించారు. ప్రజలను, మ హిళ సంఘాల మహిళ్లను బలవం తంగా సభకు తీసుకొచ్చారని పేర్కొ న్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో బిఆరెస్ 6.47 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చింది తక్కువే అన్నారు. దాని కోసమే సభ పెట్టి గొప్పలు చె ప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించా రు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీ ద ఒక్క మాట ఎందుకు మాట్లాడలే దని ప్రశ్నించారు.కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ మీద ఎన్నో మాటలు చె ప్పారు. కానీ 19 నెలలుగా బీసీల కోసం ఏమి చేసారో చెప్పాలని డి మాండ్ చేశారు.

వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు పెట్టలేదని, బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ నూ ఎం దుకు బయటపెట్టలేదని ప్రశ్నించా రు. మీ చీకటి ఒప్పందాల కోసం మోడీని కలుస్తారు కానీ బీసీ రిజ ర్వేషన్ గురించి ఎందుకు అడగడం లేదని అన్నారు.

హైకోర్ట్ డెడ్ లైన్ పెడితే ఆధారబా దరగా ఆర్డినేన్స్ తెస్తామన్నారు. కా నీ గతంలో ఆర్డినేన్స్ కు సంబంధిం చి అనేక అనుభవాలు ఉన్నాయి.
కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ సీ ల ఓట్ల కోసమే ఆర్డినేన్స్ డ్రామా అని విమర్శించారు.మోడీని ఒప్పిం చి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ద త కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి దే అన్నారు. ప్రాజెక్టలపై ఇష్ట మొచ్చినట్లు మట్లాడుతున్నారు. అ న్ని ప్రాజెక్టు లు వాళ్లే కట్టారు అట. సాగర్ నిర్మాణం లో తెలంగాణకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. మహబూబ్ నగర్ లో ప్రాజెక్టు లను పెండింగ్ లో పెడితే కెసిఆర్ పూర్తి చేసారు. అవ న్నీ పూర్తి చేసిన ఘనత బిఆర్ఎస్ అన్నారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ నూ అవగా హన లేకుండా మొదలు పెట్టి కార్మి కుల ప్రాణాలు బలిగోన్నారని మండి పడ్డారు. డిండి ప్రాజెక్టునూ కెసిఆర్ శంకుస్థాపన చేసారు. కానీ అక్కడ జరుగుతున్న పనులు కాంగ్రెస్ ప్రభు త్వం పై అనుమానాలు వచ్చేలా ఉ న్నాయి. ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఎ క్కడ ఇచ్చారో చెప్పాలి. అన్ని మో సపు మాటలే. రైతుభరోసా ఎగనా మం ద్వారా వేల కోట్లు రైతులకు బ కాయి పడ్డారు. జగదీశ్ రెడ్డి మీద వ్యక్తి గత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని కలుపు మొక్క అనడం తగదని అన్నారు.
టీడీపీలో ఉన్నపుడు మీరు ఎంత మంది ఉన్నారు. అవ్వాళ రేవంత్ రెడ్డి కూడా కలుపు మొక్కనేనా అని ప్రశ్నించారు.వ్యక్తిగత ఆరోపణలు సరికాదు. అ భివృద్ధి మీద మాట్లా డు. కానీ మళ్ళీ ఇట్లనే వ్యక్తిగతంగా మాట్లాడితే సరి గ్గానే బుద్ధి చెబు తామని హెచ్చరించారు.

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సభ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదు. కాళేశ్వరం ద్వారా గోదావ రి జలాలను తెచ్చి పారించిన ఘన త కెసిఆర్ దే.కానీ నీళ్ళే రాలేదని అబద్దాలు చెప్పడం సీఎం స్థాయిలో తగదు. నీళ్లు ఎపుడు వచ్చాయో… సీఎం కు మంత్రులకు లై డీటేక్టర్ టె స్ట్ పెడితే తేలుతుంది అన్నారు. కూ లేశ్వరం అని మాట్లాడడం బుద్ధిలేని తన మని విమర్శించారు.గతంలో నీళ్లు వచ్చినా రాలేదు అంటున్న మి మ్మల్ని అక్కడి ప్రజలు నిలదీయడా నికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖా యం. అరవై ఏండ్లు పాలించిన కాం గ్రెస్ నేతలు కట్టిన ప్రాజెక్ట్ లన్ని అవి నీతితోనే కట్టారా అని నిలదీశారు. కాళేశ్వరం కడితే ఎలా అవినీతి అ వుతుందో చెప్పాలని డిమాండ్ చే శారు. బాధ్యతయుతమైన సీఎం స్థానంలో ఉండి మూడు ఫీట్స్, నా లుగు ఫీట్లు అని మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు.

ఆరు, ఏడు ఫీట్ల పొడవున్న మీ కాం గ్రెస్ నేతలు జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.కానీ అదే జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభి వృద్ధి కీ కృషి చేసారు. మూడు మెడి కల్ కాలేజీలు, సాగర్ చివరి భూ ములకు సాగు నీళ్లు, తర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇలా వేల కోట్ల అభివృద్ధి పనులు తెచ్చారు. కానీ నేటి నల్ల గొండ మంత్రి పొద్దున లేస్తే తాగి ఆ కాశంలో తిరుగుతూ ప్రజలకు దొర క్కుండా తిరుగుతున్నాడని విమ ర్శించారు. సాగర్ కు నీళ్లు వస్తున్నా నేటికీ ఏఏంఆర్పీ ప్రాజెక్ట్ కు నేటికీ నీటి విడుదల లేదు. రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు.
ఇవ్వన్నీ పక్కన పెట్టి ఇచ్చిన హా మీలకు ఎగనామం పెడుతూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడితే చూ స్తూ ఊరుకోమని హెచ్చరించారు. బిఆరెస్ నేతలను రెచ్చగొట్టవద్దు. రెచ్చగొడితే మేము దేనికైనా సిద్ద మే. ఇట్లనే ఉంటే తరిమితరిని కొ ట్టాల్సిన అవసరం వస్తదని హెచ్చ రించారు.

మరో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ రాజ కీయాల్లో మంచి భాష ఉపయోగిం చాలి.ఏ నేత ఆస్తులు ఏంటో… ప్ర జలకు అన్ని తెలుసు. 45 ఏండ్ల కిం దట ఎవరీ ఆస్తులు ఏంటో చూ ద్దాం.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలో చించాలి. ఖమ్మలో సీతారామ్ ప్రా జెక్టు ద్వారా నీళ్లు పారిస్తున్నారు. ఇ ది చూసి పొంగులేటి సాగర్ నీళ్లు తీ సుకు పోతున్నారు. కానీ ఉత్తమ్ కు మార్ రెడ్డి ఏమి చేస్తున్నారో చెప్పా లి. తక్షణమే సాగర్ ఎడమ కాల్వ కు సాగునీల్లు వదిలి నారు మళ్లను కాపాడాలని అన్నారు.

మాజీ జెడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం, మంత్రు లు గోబెల్స్ ప్రచారానికి పాల్పడు తున్నారని ఆరోపించారు. ఒకే అం శాన్ని పదే పదే చెప్పుతు ప్రజల్ని మ భ్య పెట్టాలని చూస్తున్నారని విమ ర్శించారు. వర్షాకాలం వచ్చినా నేటి కీ పంచాయితిల్లో పరిశుద్ధ చర్యలు లేవు.దేశంలోనే నెంబర్ వన్ పంచా యతీలుగా ఉన్నా గ్రామాలను బ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అధికారం కోసం అబద్దాలు ఆ డారు. ఇపుడు అదే తీరులో మాట్లా డం తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నిరం జన్ వలి, రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేం దర్, కటికం సత్తయ్య గౌడ్, పంకజ్ యాదవ్, ప్రసన్నరాజ్, తదితరులు ఉన్నారు.