Fake currency : ప్రజా దీవెన, హైదరాబాద్: 14 వేల ఒరిజినల్ కరెన్సీ ఇస్తే లక్ష ఫేక్ కరె న్సీ ఇస్తానంటూ హైదరాబాద్ లో మకాం వేసిన పాత నేరస్థుడిని శని వారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకా రం ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెం దిన పి.మురళీ క్రిష్ణ చాలా వ్యా పారాలు చేశాడు.
ఏ వ్యాపారంలో సక్సెస్ కాలేదు.ఆర్థిక నష్టాలు అధి కమవడంతో ఫేక్ కరెన్సీ తయారీ కి శ్రీకారం చుట్టాడు.దీని కోసం గుంటూరు నుంచి ఖమ్మం ప్రాంతానికి మకాం మార్చిన మురళీ కృష్ణ ఫో టో షాప్ తో పాటు ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో లెడ్జర్ పేపర్ తో రూ.500 కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నాడు.