Family distributes : ఆస్తి వివాదంతో నిలిచిన దహనసంస్కారాలు
--గడిచిన రెండు రోజులుగా శవ పేటికలోనే వృద్ధుని శవం
ఆస్తి వివాదంతో నిలిచిన దహనసంస్కారాలు
–గడిచిన రెండు రోజులుగా శవ పేటికలోనే వృద్ధుని శవం
ప్రజా దీవెన, మోత్కూర్: రోజు రోజుకు మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడొక సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంతో ఓ వృద్ధుని శవాన్ని గత రెండు రోజులుగా శవపేటికలో పెట్టి దహన సంస్కారాలు నిర్వ హించని వైనం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని సదర్శాపూర్ గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…గ్రామానికి చెంది న అలకుంట్ల బాలయ్య అనారో గ్యంతో బాధ పడుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. మృ తుని కి భార్య లింగమ్మ కుమా రు లు నరేష్.సురేష్.కుమార్తెలు శోభ, సోని వున్నారు. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం తాటి పా ముల గ్రామంలో మృతుని భార్య లింగమ్మ తన అన్న రాములు ఇద్దరు కలిసి 3ఎకరాల భూమిని కొను గోలు చేసి, అందులో అర ఎకరం భూమి విక్రయించారు.
లింగమ్మకు రావాల్సిన ఒక్క ఎకరం 10 గుంటల భూమిని రాములు తన కుమార్తె లింగమ్మ పెద్ద కోడలు (నరేష్ భార్య అరుణ) కు పట్టా చేశారు. దీంతో చిన్న కొడుకు సురేష్ తనకు కూడా ఆ భూమిలో వా టా రావాలని అభ్యంతరం తెలపడంతో గత 2 రోజులుగా శవాన్ని శ వపేటికలో ఉంచారు. దహన సంస్కారాలు నిలిపివే యడంతో గ్రామ స్థులు, బంధువు లు, మృతుని కుమార్తెలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలాన్నికి వెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి ఎట్టకేలకు దహన సంస్కారాలు చే యించారు. ఏది ఏమైనప్పటికీ కనీసం మానవత్వాన్ని ప్రదర్శించ కుం డా శవాన్ని గతం మూడు రోజు లుగా శివపేటికలో పెట్టి దహన సం స్కారాలు నిలుపుదల చేయడం పట్ల గ్రామస్తులు, బంధువులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Family distributes