Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Body Donation to Medical College : ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తండ్రి పార్థీవదేహాన్ని అప్పగించిన కుటుంబ సభ్యులు

Body Donation to Medical College : ప్రజా దీవేన ,కోదాడ : కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక తమ్మర బండపాలెం గ్రామంలో నాలుగో వార్డులో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు బచ్చలకూరి జార్జి శనివారం మృతి చెందటంతో ఆదివారం కుటుంబ సభ్యులు పార్థవదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించినారు.

ఈ సందర్భంగా మెడికల్ కళాశాల అంబులెన్స్ కు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి అంబులెన్సులో జార్జి పార్థవదేహాన్ని తరలించి ఇంటి నుండి రోడ్డు వరకు వందలాదిమంది వీడ్కోలు పలుకుతూ అంబులెన్స్ తరలివచ్చారు .

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బచ్చలకూర మృత్యుంజయ. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న దున్న శ్యాము కుమార్తెలు, అల్లుళ్లు, కోడలు, మనవరాలు, మనవళ్లు, బంధువులు తదితరులు పాల్గొన్నారు